Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 8:1-11

ఆత్మ ద్వారా జీవం

1 కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. 2 ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని8:2 గ్రీకులో ఏకవచనం; కొన్ని ప్రతులలో నన్ను పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. 3 శరీరాన్ని8:3 శరీరాన్ని ఈ సందర్భాలలో గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది. బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు. 4 శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది.

5 శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. 6 శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. 7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. 8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు.

9 అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు. 10 క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది8:10 జీవిస్తుంది లేదా పాపం వలన మీ శరీరం మరణించినా మీ ఆత్మ జీవించి ఉంటుంది. 11 యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.