Pular para o conteúdo
Publicidade

రూతు 2:1,3,9,11,12,17,20

ధాన్య పొలంలో బోయజును కలిసిన రూతు

1 నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు.

3 కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.

9 పురుషులు పంట కోస్తున్నప్పుడు కనిపెట్టి స్త్రీల వెంట వెళ్లు. నిన్ను ఇబ్బంది కలిగించవద్దని పురుషులకు చెప్పాను. నీకు దాహం వేస్తే, పురుషులు నింపిన కుండల దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగు."

11 అందుకు బోయజు ఆమెతో అన్నాడు, "నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను. 12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక."

17 కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు2:17 అంటే, దాదాపు 13 కి. గ్రా. లు అయ్యింది.

20 నయోమి తన కోడలితో, "యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు" అన్నది. "ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు" అని కూడా చెప్పింది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Rute
Ver todos os capítulos de Rute