నూర్పిడి కళ్లం దగ్గర రూతు, బోయజు
1 ఒక రోజు రూతు అత్తయైన నయోమి, "నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని3:1 హెబ్రీలో విశ్రాంతి కనుగొనడం (1:9 చూడండి) వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది. 4 అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు" అని చెప్పింది.
9 "ఎవరు నీవు?" అని అతడు అడిగాడు.
రూతు జవాబిస్తూ, "నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి" అన్నది.
10 అతడు, "నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు. 11 నా కుమారీ, భయపడకు. నీవు అడిగినదంతా నీకు చేస్తాను. నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికి తెలుసు. 12 నేను నిన్ను విడిపించగల సమీపబంధువును అనే సంగతి నిజమే కాని, నా కంటే సమీపబంధువు ఒకడు ఉన్నాడు. 13 ఈ రాత్రి ఇక్కడ ఉండు, ప్రొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది; అతడు నిన్ను విడిపిస్తాడు. అయితే అతడు ఒప్పుకోకపోతే, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడిపిస్తాను. ఉదయం వరకు ఇక్కడ పడుకో" అని చెప్పాడు.
15 అంతేకాక, "నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో" అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల3:15 అంటే, 25 కి. గ్రా. లు యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు.