Pular para o conteúdo
Publicidade

రూతు 3:9,10,17

OTSA Telugu Contemporary Version

9 "ఎవరు నీవు?" అని అతడు అడిగాడు.

రూతు జవాబిస్తూ, "నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి" అన్నది.

10 అతడు, "నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు.

17 అంతేకాక, " ‘నీవు వట్టి చేతులతో నీ అత్త దగ్గరకు వెళ్లకు’ అని చెప్తూ, అతడు ఈ ఆరు కోలల యవలను నాకిచ్చాడు" అని చెప్పింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 అతడు, "ఎవరు నువ్వు?" అని అడిగాడు. ఆమె "నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు3:9 నాపై నీ కొంగు కప్పు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నది" అంది. 10 అతడు "అమ్మాయీ, నిన్ను యెహోవా దీవించాడు. పేదవారు, ధనికులు అయిన యువకులపై నువ్వు మోజు పడలేదు. అందుకని గతంలో నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరింత యోగ్యంగా ఉంది.

    17 "అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు" అంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Rute
Ver todos os capítulos de Rute