Pular para o conteúdo
Publicidade

రూతు 4:13-22

కుమారుని పొందిన నయోమి

13 బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది. 14 అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: "ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక! 15 అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది."

16 నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది. 17 అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు, "నయోమికి కుమారుడు ఉన్నాడు!" అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.

దావీదు వంశావళి

18 ఇది పెరెసు వంశావళి:

పెరెసు కుమారుడు హెస్రోను

19 హెస్రోను కుమారుడు రాము.

రాము కుమారుడు అమ్మీనాదాబు,

20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.

నయస్సోను కుమారుడు శల్మాను.

21 శల్మాను కుమారుడు బోయజు,

బోయజు కుమారుడు ఓబేదు.

22 ఓబేదు కుమారుడు యెష్షయి.

యెష్షయి కుమారుడు దావీదు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Rute
Ver todos os capítulos de Rute