Pular para o conteúdo
Publicidade

Nascimento: o que a Bíblia diz sobre a vida e a fé

O que a Bíblia ensina sobre o nascimento

Na Bíblia, o nascimento não é fruto do acaso: é um ato criador de Deus, que planeja e sustenta cada vida desde o ventre materno. As Escrituras tratam a chegada de uma criança como dádiva divina e apontam para dois outros nascimentos centrais na fé: a encarnação histórica de Jesus e o novo nascimento espiritual de quem crê.

Formados por Deus no ventre materno

A gestação é descrita no Antigo Testamento como uma obra cuidadosa das mãos do Criador. Os textos bíblicos mostram que Deus não espera o parto para conhecer o ser humano — Ele se relaciona com a pessoa e estabelece o seu propósito antes mesmo do nascimento.

నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;

నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.

నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,

అది నాకు పూర్తిగా తెలుసు.

రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,

భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,

నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.

నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;

నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే

అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.(కీర్తనలు 139:13-16)

"గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు,

నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను;

దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను"

అని చెప్పింది.(యిర్మీయా 1:5)

నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు;

నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.(కీర్తనలు 22:9)

నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;

నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.(కీర్తనలు 22:10)

పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను;

నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే.

నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.(కీర్తనలు 71:6)

"తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా?

తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా?

తల్లియైన మరచిపోవచ్చు కాని

నేను నిన్ను మరవను!(యెషయా 49:15)

నేను ప్రసవవేదన కలిగించి

జన్మనివ్వకుండా ఉంటానా?"

అని యెహోవా అడుగుతున్నారు.

"పుట్టుక వరకు తీసుకువచ్చి

గర్భాన్ని మూస్తానా?"

అని నీ దేవుడు అడుగుతున్నారు.(యెషయా 66:9)

O nascimento de Jesus e o cumprimento da promessa

O nascimento de Jesus em Belém marca a entrada do próprio Deus na história humana. Os Evangelhos destacam a concepção virginal operada pelo Espírito Santo como o cumprimento direto das profecias messiânicas anunciadas séculos antes pelos profetas.

కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.(యెషయా 7:14)

ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు.(లూకా సువార్త 1:26,27)

అయితే ఆ దూత ఆమెతో, "మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు" అని చెప్పాడు.(లూకా సువార్త 1:30-33)

మరియ ఆ దూతతో, "నేను కన్యను కదా, అదెలా సాధ్యం?" అని అడిగింది.

అందుకు ఆ దూత, "పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.(లూకా సువార్త 1:34,35)

యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, "దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి" అని చెప్పాడు.(మత్తయి సువార్త 1:18-21)

ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది. "ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు" (అంటే "దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థం).

యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.(మత్తయి సువార్త 1:22-25)

Filhos e crianças como dádiva divina

A Bíblia celebra o nascimento de uma criança como herança do Senhor e consolo para os pais. Jesus reafirmou o valor dos pequenos ao colocá-los como exemplo de fé e dependência para quem deseja entrar no Reino de Deus.

పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం,

గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.(కీర్తనలు 127:3)

నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు.(1 సమూయేలు 1:27)

ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది.(యోహాను సువార్త 16:21)

కాబట్టి ఈ చిన్నపిల్లల్లా తమను తాము తగ్గించుకునేవారు పరలోకరాజ్యంలో గొప్పవారు. ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు.(మత్తయి సువార్త 18:4,5)

అప్పుడు యేసు, "చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే" అని చెప్పి,(మత్తయి సువార్త 19:14)

అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.(మార్కు సువార్త 10:16)

O novo nascimento espiritual

Além do nascimento biológico, o Novo Testamento fala de um segundo nascimento. Em conversa com o fariseu Nicodemos, Jesus ensinou que, assim como ninguém controla o próprio parto natural, a vida com Deus exige uma regeneração operada pelo Espírito Santo.

అందుకు యేసు, "ఒకరు తిరిగి జన్మించాలి వచనంలో కూడ లేకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో చెప్పేది నిజమే" అని అన్నారు.(యోహాను సువార్త 3:3)

దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు.(1 యోహాను పత్రిక 3:9)

Para aprofundar no cuidado pessoal do Criador sobre a formação de cada indivíduo, leia o Salmo 139 completo.

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.