Pular para o conteúdo
Publicidade

Pecado: o que a Bíblia diz sobre perdão e liberdade

O que a Bíblia ensina sobre o pecado

O pecado é a ruptura da comunhão entre a pessoa e Deus — errar o alvo estabelecido pelo Criador e transgredir a sua lei. A Escritura mostra a gravidade dessa separação na história humana, mas revela a resposta definitiva: o perdão, a purificação e a liberdade pela graça em Jesus Cristo.

పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపము.(1 యోహాను పత్రిక 3:4)

A universalidade do pecado: a condição humana

Nenhum ser humano consegue se justificar diante de Deus por esforço próprio. Do Antigo Testamento à carta aos Romanos, a Bíblia afirma que toda a humanidade falhou e que a consequência dessa separação é a morte espiritual — suprida apenas pelo dom gratuito de Deus.

మేమందరం అపవిత్రులమయ్యాము,

మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి;

మేమందరం ఆకులా వాడిపోయాము,

గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.(యెషయా 64:6)

కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.(రోమా పత్రిక 3:20)

అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.(రోమా పత్రిక 3:23,24)

పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.(రోమా పత్రిక 6:23)

Libertação da condenação e do poder do pecado

Jesus ensinou em João 8 que quem vive no pecado se torna escravo dele, e Paulo relata em Romanos 7 o conflito diário de quem tenta vencê-lo sozinho. A resposta bíblica não é o esforço moral, mas a vida no Espírito: por meio de Cristo, o domínio do pecado é quebrado e já não há condenação.

యేసు వారితో, "పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అని నేను మీతో చెప్పేది నిజము.(యోహాను సువార్త 8:34)

కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి. మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు.

అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు. మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.(రోమా పత్రిక 6:12-18)

అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు!(రోమా పత్రిక 6:15)

ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కాబట్టి పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. నేను చేసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయాలనుకున్న దానిని చేయలేదు కాని దేనిని ద్వేషిస్తానో దానినే చేశాను. చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.(రోమా పత్రిక 7:14-17)

కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.(రోమా పత్రిక 8:1,2)

O caminho da confissão e do perdão

Tentar esconder o erro adoece a alma e afasta da comunhão; confessar traz alívio e cura imediata. Quando Davi confrontou as próprias faltas nos Salmos 32 e 51, descobriu que Deus acolhe o coração contrito, promessa que o apóstolo João reafirma: Deus é fiel e justo para perdoar e purificar todo aquele que traz a culpa à luz.

తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు,

కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.(సామెతలు 28:13)

తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు?

నేను దాచిన తప్పులను క్షమించండి.(కీర్తనలు 19:12)

యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి,

ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.

యవ్వనంలో నేను చేసిన పాపాలు,

నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి;

మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి.

ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.(కీర్తనలు 25:6,7)

యెహోవా, నా దోషం ఘోరమైనది

మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.(కీర్తనలు 25:11)

తమ పాపాలు క్షమించబడినవారు

తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.(కీర్తనలు 32:1)

అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను

నా దోషాన్ని నేను దాచుకోలేదు.

"యెహోవా ఎదుట

నా అతిక్రమాలను ఒప్పుకుంటాను" అని ఒప్పుకున్నాను.

అప్పుడు నా అతిక్రమాన్ని

మీరు క్షమించారు. సెలా(కీర్తనలు 32:5)

ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి

నన్ను కరుణించండి;

మీ గొప్ప కనికరాన్ని బట్టి,

నా పాపాలను తుడిచివేయండి.

నా దోషాలన్నింటిని కడిగి,

నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.(కీర్తనలు 51:1,2)

కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను,

మీ దృష్టికి చెడు చేశాను;

మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు

మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.

నేను పాపిగా పుట్టాను,

నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని.

మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు;

ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.

హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను;

నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.

నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి;

మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి.

నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి

నా దోషమంతటిని తుడిచివేయండి.(కీర్తనలు 51:4-9)

ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు.(1 యోహాను పత్రిక 1:6)

ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.(1 యోహాను పత్రిక 1:8,9)

A vitória de Cristo e a vida prática em santidade

A libertação do pecado é fruto direto da cruz, onde Jesus carregou as nossas transgressões para que vivêssemos para a justiça. Como orientam as cartas aos Efésios e Colossenses, a fé transforma o cotidiano: a pessoa perdoada abandona a mentira, a ira descontrolada e as velhas práticas para andar em luz.

ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి" అని చెప్పాడు.(మత్తయి సువార్త 1:21)

అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచి ఉన్నవారిని రక్షించడానికి ఆయన రెండవసారి వస్తారు.(హెబ్రీ పత్రిక 9:28)

మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, "మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.(1 పేతురు పత్రిక 2:24)

సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.(1 యోహాను పత్రిక 3:8)

దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు.(1 యోహాను పత్రిక 5:18)

కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.(కొలొస్సీ పత్రిక 3:5)

"మీ కోపంలో పాపం చేయకండి": సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి.(ఎఫెసీ పత్రిక 4:26)

లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు.(ఎఫెసీ పత్రిక 5:3)

నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.(ఎఫెసీ పత్రిక 5:11,12)

Restauração comunitária e responsabilidade com o próximo

Lidar com o erro na convivência exige mansidão, verdade e disposição para perdoar. Jesus ensinou em Mateus 18 o caminho pessoal para corrigir e recuperar quem errou, enquanto Paulo e Tiago exortam a igreja a carregar as cargas uns dos outros com humildade, lembrando que o amor cobre multidão de pecados.

మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.(మత్తయి సువార్త 6:14)

"నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?(మత్తయి సువార్త 7:3)

"ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు.(మత్తయి సువార్త 18:6)

"ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే.(మత్తయి సువార్త 18:15)

సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.(గలతీ పత్రిక 6:1,2)

ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు.(యాకోబు పత్రిక 3:10)

వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.(యాకోబు పత్రిక 4:4)

దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:8)

కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.(యాకోబు పత్రిక 4:17)

కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.(యాకోబు పత్రిక 5:16)

అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.(1 పేతురు పత్రిక 4:8)

Vigilância diária e proteção contra a queda

Desde o aviso de Deus a Caim em Gênesis 4 sobre o pecado que "jaz à porta", a Bíblia ensina que a integridade depende de vigilância diária. O Salmo 1 e o Salmo 119 mostram que guardar o coração, alimentar a mente na Escritura e escolher com prudência as companhias sustentam os passos no caminho reto.

నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి."(ఆది 4:7)

దుష్టుల సలహాను పాటించక

పాపులు కోరుకునే మార్గంలో నిలబడక

ఎగతాళి చేసేవారి

గుంపుతో కూర్చోక,(కీర్తనలు 1:1)

మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి;

ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.(కీర్తనలు 119:133)

యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు,

కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.(సామెతలు 10:9)

మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.(లూకా సువార్త 6:45)

పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, "చూడండి, ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను" అని చెప్పాడు. యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు. పిలాతు వారితో, "ఇదిగో, ఈ మనుష్యుడు!" అని చెప్పాడు.

ముఖ్య యాజకులు వారి అధికారులు ఆయనను చూడగానే, "సిలువ వేయండి! సిలువ వేయండి!" అని కేకలు వేశారు.

అయితే పిలాతు, "మీరే ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు" అన్నాడు.(యోహాను సువార్త 19:4-6)

మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు" అన్నారు.(యోహాను సువార్త 20:23)

తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా, దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.(1 కొరింథీ పత్రిక 6:9,10)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.