Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 1

1 దుష్టుల సలహాను పాటించక

పాపులు కోరుకునే మార్గంలో నిలబడక

ఎగతాళి చేసేవారి

గుంపుతో కూర్చోక,

2 యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,

రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.

3 వారు నీటికాలువల ప్రక్కన నాటబడి,

ఆకులు వాడిపోకుండ,

సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు

వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.

4 అయితే దుష్టులు అలా ఉండరు!

వారు గాలికి కొట్టుకుపోయే

పొట్టులా ఉంటారు.

5 కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు,

నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.

6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు,

దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.