Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 58

సంగీత దర్శకునికి. "నిర్మూలం చేయకు" అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన.

1 పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా?

మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?

2 లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు,

దేశంలో హింసను పెంచుతున్నారు.

3 ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు;

గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు.

4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది

చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు

5 పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా

ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు.

6 దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి;

యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.

7 ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక;

వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.

8 వారు నడుస్తూ కరిగి నశించిపోయే నత్తల్లా వారుంటారు.

గర్భస్రావమై వెలుగు చూడని పిండంలా వారవుతారు.

9 మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే,

పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు.

10 ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు,

దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.

11 తర్వాత ప్రజలు అది చూసి,

"నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది;

ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు" అంటారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.