Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 87

కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము.

1 యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.

2 యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె

యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.

3 దేవుని పట్టణమా, నీ గురించి

గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సెలా

4 "నేను రాహాబు87:4 ఈజిప్టు యొక్క కావ్య నామము. పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు. బబులోనును

నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను

అలాగే ఫిలిష్తియా, తూరు కూషు87:4 అంటే, నైలు ఉపరితల ప్రాంతం కూడా,

‘ఇది సీయోనులో పుట్టింది’ " అని వారంటారు.

5 నిజమే, సీయోను గురించి ఇలా అంటారు,

"ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి,

మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు."

6 యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు

"ఇది సీయోనులో జన్మించింది" అని గుర్తిస్తారు. సెలా

7 వారు వాయిద్యాలు వాయిస్తుండగా,

"నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి" అని వారు పాడతారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.