Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 149

1 యెహోవాను స్తుతించండి.149:1 హెబ్రీలో హల్లెలూయా; 9 వచనంలో కూడ

యెహోవాకు క్రొత్త పాట పాడండి,

ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.

2 ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక;

సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.

3 వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు

తంబురతో సితారాతో గానం చేస్తారు.

4 యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు;

దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.

5 ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక.

వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.

6 వారి నోళ్ళలో దేవుని స్తుతి

వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.

7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి

ప్రజలను శిక్షించడానికి,

8,9 వారి రాజులను సంకెళ్ళతో,

ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి,

వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది,

ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది.

యెహోవాను స్తుతించండి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.