Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 76

సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.

1 యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు;

ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.

2 షాలేములో ఆయన గుడారం ఉంది.

సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.

3 అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు,

డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా

4 వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే,

మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు.

5 బలవంతులు దోపిడి చేయబడ్డారు,

వారు నిద్రపోయారు.

ఏ ఒక్క యోధుడు

మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.

6 యాకోబు దేవా! మీరు గద్దిస్తే

గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.

7 మీ ఒక్కరికే భయపడాలి.

మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?

8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు,

దేశం భయపడి మౌనం వహించింది.

9 ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి,

తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా

10 మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది,

మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.76:10 లేదా మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్నవారు నియంత్రించబడతారు

11 దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి;

పొరుగు దేశాలన్నీ

భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.

12 పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు;

భూరాజులు ఆయనను చూసి భయపడాలి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.