Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 110

దావీదు కీర్తన.

1 యెహోవా నా ప్రభువుతో110:1 లేదా ప్రభువు చెప్పిన మాట:

"నేను నీ శత్రువులను

నీ పాదపీఠంగా చేసే వరకు

నీవు నా కుడిచేతి వైపున కూర్చో."

2 యెహోవా, "నీ శత్రువుల మధ్య పరిపాలించు!" అని అంటూ,

సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,

3 మీ యుద్ధ దినాన

మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి.

పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై

ఉదయపు గర్భం నుండి మంచులా

మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.

4 "మెల్కీసెదెకు క్రమంలో,

నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు"

అని యెహోవా ప్రమాణం చేశారు

ఆయన తన మనస్సు మార్చుకోరు.

5 ప్రభువు110:5 లేదా నా ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నారు; మీ కుడి ప్రక్కనే ఉన్నాడు;

తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు.

6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు;

అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.

7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు,

కాబట్టి అతడు తల పైకెత్తుతాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.