Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 43

1 నా దేవా, నాకు న్యాయం తీర్చండి,

భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా

నా పక్షంగా వాదించి,

మోసగాళ్ల నుండి దుష్టుల నుండి

నన్ను విడిపించండి.

2 మీరే దేవుడు, నా బలమైన కోట.

నన్నెందుకు ఇలా తిరస్కరించారు?

శత్రువులచేత అణచివేయబడుతూ

నేనెందుకు దుఃఖంతో గడపాలి?

3 మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి;

అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి

మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.

4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను,

నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను.

దేవా! నా దేవా!

వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?

నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?

దేవుని మీద నిరీక్షణ ఉంచు,

ఆయనే నా రక్షకుడు నా దేవుడు

నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.