Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 64

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

1 నా దేవా, నా ఫిర్యాదు వినండి;

శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.

2 దుష్టుల కుట్ర నుండి,

కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.

3 వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు

మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.

4 చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు.

వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.

5 కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు.

వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు;

వారంటారు, "దీన్ని64:5 లేదా మనల్ని ఎవరు చూస్తారు?"

6 వారు అన్యాయాలను రూపొందించి అంటారు,

"మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!"

నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.

7 కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు;

వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.

8 ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి

వారిని పతనానికి తెస్తారు;

వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.

9 మనుష్యులందరు భయపడతారు;

దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు

ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.

10 నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక.

ఆయననే ఆశ్రయించెదరు గాక.

యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.