Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 132

యాత్రకీర్తన.

1 యెహోవా, దావీదును,

అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.

2 అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు,

యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:

3-5 "యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు,

యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు,

నేను నా ఇంట్లోకి ప్రవేశించను,

నా మంచం మీద పడుకోను,

నా కళ్ళకు నిద్ర లేదా

నా కనురెప్పలకు కునుకు రానివ్వను."

6 దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం,

యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.132:6 అలాగే 1 దిన 13:5-6 లో కూడా ఉంది.

7 "ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి,

ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.

8 ‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో,

మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.

9 మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక;

నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ "

10 మీ సేవకుడైన దావీదు నిమిత్తం,

మీ అభిషిక్తుని తిరస్కరించకండి.

11 యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు,

అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు:

"మీ సంతానంలో ఒకనిని

మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.

12 మీ కుమారులు నా ఒడంబడికను

వారికి బోధించిన చట్టాలను పాటిస్తే,

వారి కుమారులు కూడా

నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు" అని చెప్పారు.

13 యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు,

దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.

14 "ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది;

ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను,

ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.

15 ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను;

ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను.

16 ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను,

ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు.

17 "అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను

నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను.

18 అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను,

కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.