Sabedoria: o que é e como adquiri-la segundo a Bíblia
O que é sabedoria segundo a Bíblia
Na Bíblia, sabedoria não é mero acúmulo de informações nem inteligência teórica, mas a habilidade prática de viver e tomar decisões retas segundo a vontade de Deus. Essa sabedoria tem um ponto de partida indispensável: o temor do Senhor — uma postura de reverência, respeito e humilde reconhecimento de quem Deus é.
Quem busca sabedoria longe do Criador constrói sobre bases frágeis. Em Provérbios e nos livros poéticos, o verdadeiro discernimento nasce quando colocamos Deus no centro da vida cotidiana.
యెహోవాయందు భయం తెలివికి మూలం,
అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.(సామెతలు 1:7)
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,
పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.(సామెతలు 9:10)
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము
ఘనతకు ముందు వినయం ఉంటుంది.(సామెతలు 15:33)
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం;
ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు.
స్తుతి నిత్యం ఆయనకే చెందును.(కీర్తనలు 111:10)
అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు;
అది సజీవుల దేశంలో దొరకదు.
"అది నాలో లేదు" అని అగాధం అంటుంది;
"అది నాలో లేదు" అని సముద్రం అంటుంది.
మేలిమి బంగారంతో దానిని కొనలేము,
దాని వెలకు సరిపడా వెండిని తూచలేము.
ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా
నీలమణితోనైనా దానిని కొనలేము.
బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము;
బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము.
పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు;
జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది.
కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము;
శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము.
అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది?
అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది,
ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది.
"కేవలం దాని గురించిన వదంతిని విన్నాము"
నరకము మృత్యువు అంటాయి.(యోబు 28:12-22)
Como pedir e receber sabedoria de Deus
A sabedoria bíblica não é conquistada apenas por esforço intelectual, mas recebida como dádiva divina. Deus não esconde o discernimento de quem o procura com sinceridade; ao contrário, a promessa bíblica é que Ele concede sabedoria com generosidade a todo aquele que pede com fé.
మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.(యాకోబు పత్రిక 1:5)
నీవు అంతరార్థం కోసం మొరపెడితే,
వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు,
దేవుని తెలివిని కనుగొంటావు.(సామెతలు 2:3,5)
ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు;
తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.(సామెతలు 2:6)
ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.(దానియేలు 1:17)
ఇలా అన్నాడు:
"దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక;
జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.(దానియేలు 2:20)
నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను:
మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు,
మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు,
రాజు కలను మీరు మాకు తెలియజేశారు."(దానియేలు 2:23)
A sabedoria divina e a sabedoria humana
O Novo Testamento estabelece um contraste nítido entre a sabedoria do alto e a sabedoria terrena. Enquanto a lógica do mundo frequentemente valoriza a ambição egoísta, a autossuficiência e a esperteza, a sabedoria de Deus se manifesta em caráter: pureza, mansidão, misericórdia e frutos de justiça.
మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.(యాకోబు పత్రిక 3:13)
పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.(యాకోబు పత్రిక 3:17)
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు. అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు. ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.(1 కొరింథీ పత్రిక 1:23-25)
అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం.(1 కొరింథీ పత్రిక 2:6,7)
మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి "బుద్ధిలేనివారిగా" కావాలి.(1 కొరింథీ పత్రిక 3:18)
వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి.(కొలొస్సీ పత్రిక 2:2,3)
Direção e discernimento para tomar decisões
Buscar sabedoria é essencial nos momentos de encruzilhada. As Escrituras ensinam que a direção de Deus não costuma anular a reflexão, mas transforma a confiança: em vez de depender exclusivamente do próprio entendimento, o sábio entrega seus passos ao Senhor e busca ser guiado com mansidão.
నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు
నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,
అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.(సామెతలు 3:5,6)
నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;
యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.(సామెతలు 3:7)
యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.
మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.
మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,
మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,
మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.(కీర్తనలు 25:4,5)
న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు,
తన మార్గాలను వారికి బోధిస్తారు.(కీర్తనలు 25:9)
యెహోవా, మీ మార్గం నాకు బోధించండి;
నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు,
కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.(కీర్తనలు 27:11)
మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను;
మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.(కీర్తనలు 32:8)
తనను బట్టి ఆనందించేవారి అడుగులను
యెహోవా స్థిరపరుస్తారు;(కీర్తనలు 37:23)
నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి,
ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక.
నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను,
నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.(కీర్తనలు 143:8)
మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి,
మీరు నా దేవుడు;
మీ మంచి ఆత్మ
సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి;
మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.(కీర్తనలు 143:10,11)
A Palavra de Deus como fonte de discernimento
A revelação bíblica é o padrão pelo qual toda escolha deve ser avaliada. O salmista descreve a instrução do Senhor como lâmpada para os pés — suficiente para dar o próximo passo com segurança em meio à escuridão e proteger de caminhos enganosos.
మీ వాక్కు నా పాదాలకు దీపం,
నా త్రోవకు వెలుగు.(కీర్తనలు 119:105)
మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని
నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.(కీర్తనలు 119:18)
మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది.
అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది.(కీర్తనలు 119:130)
దుష్టుల సలహాను పాటించక
పాపులు కోరుకునే మార్గంలో నిలబడక
ఎగతాళి చేసేవారి
గుంపుతో కూర్చోక,
యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,
రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.(కీర్తనలు 1:1,2)
నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి;
నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి.
నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.(సామెతలు 6:22)
సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.(కొలొస్సీ పత్రిక 3:16)
Sabedoria prática no dia a dia
A sabedoria bíblica se prova nas situações comuns: no controle da fala, na capacidade de ouvir críticas, na administração do tempo e no trato com as pessoas. Quem cultiva a prudência aprende a frear a impulsividade e a valorizar o conselho maduro.
చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.(ఎఫెసీ పత్రిక 5:15,16)
జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు,
వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.(సామెతలు 1:5)
జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు,
మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.(సామెతలు 10:8)
గర్వము వెంబడి అవమానం వస్తుంది,
కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.(సామెతలు 11:2)
మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది,
కాని జ్ఞానులు సలహాలు వింటారు.(సామెతలు 12:15)
తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు,
కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.(సామెతలు 13:3)
గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది,
కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.(సామెతలు 13:10)
ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు,
త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.(సామెతలు 14:29)
ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,
తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.(సామెతలు 17:28)
మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు
కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు.(సామెతలు 18:2)
వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది,
జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.(సామెతలు 18:15)
తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు;
మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.(సామెతలు 19:8)
నీవు ముందుకు జ్ఞానివగుటకై,
ఆలోచన విని బోధను అంగీకరించు.(సామెతలు 19:20)
ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి,
మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.(సామెతలు 20:18)
ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం
అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.(సామెతలు 24:6)
మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి. మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.(కొలొస్సీ పత్రిక 3:23,24)
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.(కొలొస్సీ పత్రిక 4:5,6)
O valor de uma vida sábia
A Bíblia coloca a sabedoria acima de ouro, prata e pedras preciosas. Bens materiais podem ser perdidos em um instante, mas o discernimento concedido por Deus protege a vida, preserva a integridade e produz frutos duradouros de paz e justiça.
జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
వివేచన కలిగినవారు ధన్యులు.(సామెతలు 3:13)
నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు,
వారు యెహోవా దయ పొందుకుంటారు.(సామెతలు 8:35)
హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి,
కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.(సామెతలు 16:1)
మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు,
యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.(సామెతలు 16:9)
బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం,
వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!(సామెతలు 16:16)
తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.(ప్రసంగి 2:26)
డబ్బుతో భద్రత లభించినట్లే,
జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది,
ప్రయోజనం ఏంటంటే:
జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.(ప్రసంగి 7:12)
మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.(ప్రసంగి 9:10)
A sabedoria soberana do Criador
O entendimento humano é limitado pelo tempo e pela nossa própria fragilidade, mas os caminhos de Deus são perfeitos e insondáveis. Ter sabedoria diante da soberania divina é aprender a contar os dias com humildade, confiando no propósito do Criador mesmo quando não compreendemos todos os detalhes da caminhada.
నీకు తెలియదా?
నీవు వినలేదా?
భూమి అంచులను సృష్టించిన
యెహోవా నిత్యుడైన దేవుడు.
ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు,
ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.(యెషయా 40:28)
"నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,
మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు"
అని యెహోవా చెప్తున్నారు.(యెషయా 55:8)
"ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో,
మీ మార్గాల కన్నా నా మార్గాలు
మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.(యెషయా 55:9)
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది!
ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి,
ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!(రోమా పత్రిక 11:33)
యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.(రోమా పత్రిక 16:27)
మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి,
తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.(కీర్తనలు 90:12)
ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు.
యెహోవా నీ నుండి కోరేదేంటి?
న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం,
వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.(మీకా 6:8)
"కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు.(మత్తయి సువార్త 7:24)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.