Pular para o conteúdo
Publicidade

1 దినవృత్తాంతాలు 29:11,12,14,15

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.

14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం. 15 మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    11 యెహోవా! మహాత్మ్యం, ప్రభావం,

    వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి.

    ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే.

    యెహోవా రాజ్యం మీదే;

    మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.

    12 ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి;

    మీరు సమస్తానికి పాలకులు.

    అందరిని హెచ్చించి, బలపరచడానికి

    మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.

    14 "అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము. 15 మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.