11 యెహోవా! మహాత్మ్యం, ప్రభావం,
వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి.
ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే.
యెహోవా రాజ్యం మీదే;
మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.
12 ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి;
మీరు సమస్తానికి పాలకులు.
అందరిని హెచ్చించి, బలపరచడానికి
మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.
14 "అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము. 15 మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.