5 అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం గనక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు రెండు భాగాలు ఇస్తుండేవాడు.
8 ఆమె భర్త ఎల్కానా "హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? పదిమంది కొడుకులకన్నా నేను నీకు ఎక్కువ కాదా?" అని ఆమెతో చెబుతూ ఉండేవాడు.
11 ఆమె ఒక ప్రమాణం చేస్తూ "సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను" అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు.
23 అప్పుడు ఆమె భర్త ఎల్కానా "నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకూ రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక" అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానేవరకూ అతన్ని పెంచుతూ ఉంది.
27 యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు. 28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు" అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు.