5 అయితే అతడు హన్నాను ప్రేమించాడు కాబట్టి ఆమెకు రెండంతలు ఇస్తూ వచ్చాడు, యెహోవా ఆమె గర్భాన్ని మూసివేశారు. 8 ఆమె భర్త ఎల్కానా ఆమెతో, "హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు తినడం లేదు? నీవెందుకు క్రుంగిపోతున్నావు? నీకు పదిమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా?" అని అన్నాడు.
11 ఆమె, "సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు" అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.
23 "నీకు ఏది మంచిదో అది చేయి, వానిని పాలు మాన్పించేవరకు నీవు ఇక్కడే ఉండు; యెహోవా తన మాట నెరవేర్చును గాక" అని ఆమె భర్తయైన ఎల్కానా ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆ స్త్రీ తన కుమారుని పాలు మాన్పించేవరకు ఇంట్లోనే ఉండి వానిని పోషించింది.
27 నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు. 28 కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు" అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.