7 అప్పుడు సౌలు "నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను" అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు "అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది" అని అతనితో చెప్పారు.
15 "నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు" అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు "నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను" అన్నాడు.