7 సౌలు తన సహాయకులకు, "మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను" అని ఆజ్ఞాపించాడు.
అప్పుడు వారు, "ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది" అని చెప్పారు.
15 అప్పుడు సమూయేలు సౌలును, "నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?" అని అడిగాడు.
అందుకు సౌలు, "నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను" అన్నాడు.