10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.
11 సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది. 12 కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు. 13 కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు.
14 సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు.