Pular para o conteúdo
Publicidade

2 సమూయేలు 21:10-14

OTSA Telugu Contemporary Version

10 అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది. 11 అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు, 12 దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.) 13 దావీదు వారి దగ్గర నుండి సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తెప్పించాడు. రాజాజ్ఞ ప్రకారం ఉరితీయబడిన ఆ ఏడుగురి ఎముకలు కూడా సమకూర్చారు.

14 సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తీసుకుని బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ వారు చేసిన తర్వాత దేశం కోసం వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.

    11 సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది. 12 కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు. 13 కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు.

    14 సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.