6 వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. 7 వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు. 9 ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి "యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?" అనుకున్నాడు. 10 కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడ లేదు. గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకు వచ్చి అక్కడ ఉంచాడు.
11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమునూ, అతని కుటుంబాన్నీ ఆశీర్వదించాడు. 12 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు.