Pular para o conteúdo
Publicidade

2 సమూయేలు 6:6,7,9-12

OTSA Telugu Contemporary Version

6 వారు నాకోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. 7 ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.

9 ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి, "యెహోవా మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?" అని అనుకున్నాడు. 10 యెహోవా మందసాన్ని తనతో పాటు దావీదు పట్టణానికి తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు, కాబట్టి దావీదు దానిని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు. 11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంట్లోనే మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటి వారినందరిని దీవించారు.

12 "దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు" అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. 7 వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు. 9 ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి "యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?" అనుకున్నాడు. 10 కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడ లేదు. గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకు వచ్చి అక్కడ ఉంచాడు.

    11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమునూ, అతని కుటుంబాన్నీ ఆశీర్వదించాడు. 12 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.