21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.
మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా
నేను వాటిని అంగీకరించను.
సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.
మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.
నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.