ఎఫెసులో యోహాను శిష్యగణం క్రైస్తవులు కావడం
1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, "మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?" అని అడిగాడు. 2 వారు, "అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు" అని చెప్పారు. 3 అప్పుడు పౌలు, "అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?" అని అడగ్గా, వారు, "యోహాను బాప్తిసం" అని చెప్పారు.