Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 19:1-3

OTSA Telugu Contemporary Version

ఎఫెసు పట్టణంలో పౌలు

1 అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు, పౌలు పల్లె ప్రాంతాలు సంచరిస్తూ ఎఫెసుకు చేరాడు. 2 అక్కడ అతడు కొందరు శిష్యులను కలిసి వారిని, "మీరు క్రీస్తును నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారా?" అని అడిగాడు.

అప్పుడు వారు, "లేదు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నదని కూడా మేము ఎప్పుడు వినలేదు" అన్నారు.

3 అప్పుడు పౌలు, "అలాగైతే మీరు ఏ బాప్తిస్మాన్ని పొందుకున్నారు?" అని అడిగాడు.

అప్పుడు వారు, "యోహాను బాప్తిస్మం" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, "మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?" అని అడిగాడు. 2 వారు, "అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు" అని చెప్పారు. 3 అప్పుడు పౌలు, "అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?" అని అడగ్గా, వారు, "యోహాను బాప్తిసం" అని చెప్పారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.