రోమా పౌరుని ఆధిక్యత
25 వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, "శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?" అని అడిగాడు. 26 శతాధిపతి ఆ మాట విని సైనికాధికారి దగ్గరికి వెళ్ళి, "నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?" అన్నాడు. 27 అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలుతో, "నీవు రోమ్ పౌరుడివా? అది నాతో చెప్పు" అన్నాడు. 28 పౌలు "అవును" అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, "నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను" అన్నాడు. అందుకు పౌలు, "నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి" అని చెప్పాడు.