25 వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, "ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?" అన్నాడు.
26 అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, "మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు" అని చెప్పాడు.
27 ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, "నీవు రోమీయుడవా?" అని అడిగాడు.
"అవును, నేను రోమీయుడనే" అని సమాధానం ఇచ్చాడు.
28 అప్పుడు ఆ అధిపతి, "నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను" అన్నాడు.
దానికి పౌలు, "నేను పుట్టుకతోనే రోమీయుడను" అని సమాధానం చెప్పాడు.