7 మోషే యెహోషువను పిలిచి, "నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు" అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.
Publicidade
ద్వితీయోపదేశ కాండము 31:7,8
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
7 తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: "నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి. 8 యెహోవాయే స్వయంగా మీ ముందు వెళ్తారు మీతో ఉంటారు; ఆయన నిన్ను ఎన్నడూ వదిలేయరు, నిన్ను చేయి విడువరు. భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.