Pular para o conteúdo
Publicidade

ఎస్తేరు 6:1-3,6,10,11

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

మొర్దెకైకు సత్కరం

1 ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు. 2 ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.

3 రాజు ఆ సంగతి విని "మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?" అని అడిగాడు. రాజు సేవకులు "అతనికేమీ చేయలేదు" అని జవాబిచ్చారు.

6 "రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?" అని రాజు అతన్ని అడిగాడు. హామాను "నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?" అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు,

10 వెంటనే రాజు "అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి" అని హామానుకు ఆజ్ఞాపించాడు. 11 హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ "రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది" అని అతని ముందర నడుస్తూ చాటించాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు; కాబట్టి తన పాలన గురించి ఉన్న రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి, చదివించుకున్నాడు. 2 అందులో రాజభవన ద్వారపాలకులైన బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజ్యాధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నిన సంగతిని మొర్దెకై తెలియజేసినట్లు వ్రాయబడి ఉంది.

    3 రాజు, "దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?" అని అడిగాడు.

    అందుకు అతని సేవకులు, "అతని కోసం ఏమి చేయలేదు" అన్నారు.

    6 హామాను లోపలికి వచ్చినప్పుడు, "రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?" అని రాజు అతన్ని అడిగాడు.

    హామాను, "నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?" అని తనలో తాను అనుకున్నాడు.

    10 అందుకు రాజు, "త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు" అని హామానుకు ఆజ్ఞాపించాడు.

    11 కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, "రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!" అని అంటూ ఊరేగింపు చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.