Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 18:13,17,18,23,24

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

13 మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ ప్రజలు మోషే దగ్గర బారులు తీరి నిలబడ్డారు.

ద్వితీ 1:9-18

17 అందుకు మోషే మామ అతనితో "నీవు చేస్తున్న పని మంచిది కాదు. 18 ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది.

23 ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు" అని చెప్పాడు. 24 మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    13 మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు.

    17 అందుకు మోషే మామ, "నీవు చేస్తున్నది సరియైనది కాదు. 18 నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు. 23 ఒకవేళ నీవు ఇలా చేస్తే, దేవుడు అలాగే ఆజ్ఞాపిస్తే, నీవు ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతావు, అలాగే ఈ ప్రజలందరు కూడా సమాధానంగా తమ ఇళ్ళకు వెళ్తారు" అని అన్నాడు.

    24 మోషే తన మామ చెప్పిన సలహా విని అతడు చెప్పినట్లే చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.