13 మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు.
17 అందుకు మోషే మామ, "నీవు చేస్తున్నది సరియైనది కాదు. 18 నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు. 23 ఒకవేళ నీవు ఇలా చేస్తే, దేవుడు అలాగే ఆజ్ఞాపిస్తే, నీవు ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతావు, అలాగే ఈ ప్రజలందరు కూడా సమాధానంగా తమ ఇళ్ళకు వెళ్తారు" అని అన్నాడు.
24 మోషే తన మామ చెప్పిన సలహా విని అతడు చెప్పినట్లే చేశాడు.