Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 3:1-6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

మండుతున్న పొద దగ్గర మోషే

1 మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ 3:1 పవిత్ర పర్వతం.దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. 2 అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.

3 అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. 4 దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు "మోషే, మోషే" అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు "చిత్తం ప్రభూ" అన్నాడు. 5 అందుకు ఆయన "దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది" అన్నాడు. 6 ఆయన ఇంకా "నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి" అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో3:1 మోషే మామ యెత్రో, రగూయేలు అనే రెండు పేర్లతో పిలువబడేవాడు. అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు3:1 హోరేబు సీనాయికి మరొక పేరు. దగ్గరకు వచ్చాడు. 2 అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు. 3 అప్పుడు మోషే, "నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను" అని అనుకున్నాడు.

    4 దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, "మోషే! మోషే!" అని అతన్ని పిలిచారు.

    అందుకు మోషే, "నేను ఇక్కడ ఉన్నాను" అన్నాడు.

    5 అందుకు దేవుడు, "దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు" అన్నారు. 6 ఇంకా ఆయన, "నేను నీ తండ్రి3:6 కొ.ప్రా.ప్ర. లలో తండ్రులు అపొ. కా. 7:32 దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను" అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.