మోషే, మండుతున్న పొద
1 ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో3:1 మోషే మామ యెత్రో, రగూయేలు అనే రెండు పేర్లతో పిలువబడేవాడు. అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు3:1 హోరేబు సీనాయికి మరొక పేరు. దగ్గరకు వచ్చాడు. 2 అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు. 3 అప్పుడు మోషే, "నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను" అని అనుకున్నాడు.
4 దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, "మోషే! మోషే!" అని అతన్ని పిలిచారు.
అందుకు మోషే, "నేను ఇక్కడ ఉన్నాను" అన్నాడు.
5 అందుకు దేవుడు, "దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు" అన్నారు. 6 ఇంకా ఆయన, "నేను నీ తండ్రి3:6 కొ.ప్రా.ప్ర. లలో తండ్రులు అపొ. కా. 7:32 దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను" అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.