Pular para o conteúdo
Publicidade

గలతీయులకు రాసిన పత్రిక 3:6-9

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

అబ్రాహాము నిబంధన విశ్వాస నిబంధన

6 అబ్రాహాము, "దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది." 7 కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. "ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి." అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. 9 కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, "దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది."3:6 ఆది 15:6

    7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. 8 దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. "నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు"3:8 ఆది 12:3; 18:18; 22:18 అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. 9 అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.