6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, "దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది."3:6 ఆది 15:6
7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. 8 దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. "నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు"3:8 ఆది 12:3; 18:18; 22:18 అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. 9 అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.