అబ్రాముకు దేవుని పిలుపు
1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. "నీ దేశం నుంచి, నీ బంధువుల12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.
అబ్రాము, శారయి ఐగుప్తులో
10 అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. 11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో "చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, 12 ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు. 13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు" అన్నాడు.