అబ్రాముకు పిలుపు
1 యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, "నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.
4 యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు.
ఈజిప్టులో అబ్రాము
10 అప్పుడు దేశంలో కరువు వచ్చింది, అది తీవ్రంగా ఉన్నందుకు అబ్రాము కొంతకాలం ఉందామని ఈజిప్టుకు వెళ్లాడు. 11 అతడు ఈజిప్టు ప్రవేశిస్తుండగా తన భార్య శారాయితో, "నీవు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు. 12 ఈజిప్టువారు నిన్ను చూసినప్పుడు, ‘ఈమె అతని భార్య’ అని అంటారు. తర్వాత వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. 13 నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది" అని చెప్పాడు.