Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 20:2,9-13

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి "ఈమె నా చెల్లి" అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.

9 అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు "నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు" అన్నాడు. 10 అబీమెలెకు అబ్రాహామును చూసి "నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?" అని అడిగాడు.

11 అబ్రాహాము "ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను 12 అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది. 13 దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో ‘మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే’ అని చెప్పాను" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, "ఈమె నా చెల్లెలు" అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు.

    9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, "నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి" అని అన్నాడు. 10 అబీమెలెకు, "నీవు ఇలా చేయడానికి కారణమేంటి?" అని అబ్రాహామును అడిగాడు.

    11 అందుకు అబ్రాహాము అన్నాడు, "ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను. 12 అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది. 13 దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, "ఈయన నా సోదరుడు" అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ "

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.