2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, "ఈమె నా చెల్లెలు" అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు.
9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, "నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి" అని అన్నాడు. 10 అబీమెలెకు, "నీవు ఇలా చేయడానికి కారణమేంటి?" అని అబ్రాహామును అడిగాడు.
11 అందుకు అబ్రాహాము అన్నాడు, "ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను. 12 అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది. 13 దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, "ఈయన నా సోదరుడు" అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ "