Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 22:1,2,12

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

దేవుడు అబ్రాహామును పరీక్షించాడు

1 ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన "అబ్రాహామూ" అని పిలిచినప్పుడు అతడు "చిత్తం ప్రభూ" అన్నాడు. 2 అప్పుడు ఆయన అబ్రాహాముతో "నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు" అన్నాడు.

12 అప్పుడు ఆయన "ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, "అబ్రాహామూ!" అని పిలిచారు.

    "చిత్తం! ప్రభువా" అని అతడు జవాబిచ్చాడు.

    2 అప్పుడు దేవుడు ఇలా అన్నారు, "నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు."

    12 "ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!" అని దేవుని దూత మాట్లాడాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.