అబ్రాహాము పరీక్షించబడ్డాడు
1 కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, "అబ్రాహామూ!" అని పిలిచారు.
"చిత్తం! ప్రభువా" అని అతడు జవాబిచ్చాడు.
2 అప్పుడు దేవుడు ఇలా అన్నారు, "నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు."
12 "ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!" అని దేవుని దూత మాట్లాడాడు.