2 అప్పుడు ఆయన అబ్రాహాముతో "నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు" అన్నాడు.
7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును "నాన్నా" అని పిలిచాడు. దానికి అబ్రాహాము "ఏం నాయనా" అన్నాడు. అప్పుడతడు "చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?" అని అడిగాడు. 8 దానికి అబ్రాహాము "కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు" అన్నాడు.
13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14 అబ్రాహాము ఆ చోటును "22:14 అంటే యెహోవా చూసుకుంటాడు.యెహోవా యీరే" అని పిలిచాడు. కాబట్టి "యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు" అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.