2 అప్పుడు దేవుడు ఇలా అన్నారు, "నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు."
7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, "తండ్రీ" అని పిలిచాడు.
"నా కుమారుడా, ఏంటి?" అని అబ్రాహాము జవాబిచ్చాడు.
ఇస్సాకు, "నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?" అని అడిగాడు.
8 "నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు" అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
13 అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు. 14 అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే22:14 అంటే యెహోవా సమకూరుస్తారు అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, "యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది" అని చెప్పబడుతుంది.