16 ఆయన స్త్రీతో "పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు" అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో "నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు" అని చెప్పాడు.
Publicidade
ఆదికాండం 3:16-19
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు,
"నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను;
తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు.
నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది,
అతడు నిన్ను ఏలుతాడు."
17 ఆదాముతో ఆయన ఇలా అన్నారు, "నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి,
"నిన్ను బట్టి ఈ నేల శపించబడింది;
నీ జీవితకాలమంతా దాని పంట నుండి,
కష్టపడి పని చేసి తింటావు.
18 భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది,
నీవు పొలం లోని పంటను తింటావు.
19 నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి
నీవు మట్టికి చేరేవరకు,
నీ నుదిటి మీద చెమట కార్చి
నీ ఆహారాన్ని తింటావు
నీవు మట్టివి కాబట్టి
తిరిగి మన్నై పోతావు."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.