Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 40:8,12,13,18,19

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 అందుకు వారు "మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు" అన్నారు. యోసేపు వారితో "అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి" అన్నాడు. 12 అప్పుడు యోసేపు "దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు. 13 ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.

18 యోసేపు "దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు. 19 ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి" అని జవాబిచ్చాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 "మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు" అని వారు జవాబిచ్చారు.

    అప్పుడు యోసేపు వారితో, "భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి" అని అన్నాడు.

    12 యోసేపు అతనితో, "దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. 13 మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు.

    18 యోసేపు అన్నాడు, "దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. 19 మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.